Thursday, February 26, 2026
E-PAPER
Homeకరీంనగర్రైతులు అధైర్యపడవద్దు..నష్టపరిహారం అందేలా కృషి చేస్తాం: ఎమ్మెల్యే

రైతులు అధైర్యపడవద్దు..నష్టపరిహారం అందేలా కృషి చేస్తాం: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్: మండలంలోని రామాజిపేట్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. వర్షాల ప్రభావంతో సుమారు 650 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడవద్దని, అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై వెంటనే జిల్లా, మండల స్థాయి వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలిసి రైతులతో మాట్లాడినట్లు చెప్పారు.పంట నష్టాన్ని అంచనా వేసి,విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని, వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద యంత్రాల పంపిణీలో పంట నష్టపోయిన రైతులకు ప్రాధాన్యం కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో రైతు భరోసా కూడా అందజేస్తామని చెప్పారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అకాల వర్షాలకు దెబ్బతినడం చాలా బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్ట పరిహార చర్యలు చేపడుతుందని రైతులు ధైర్యంగా ఉండాలని కోరారు. కౌలు రైతులు,రైతు కూలీల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏవో ముక్తేశ్వర్,సర్పంచ్ మోహన్, ఉప సర్పంచ్ సుధీర్, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రావు, నాయకులు కోల శ్రీనివాస్, ఏనుగు మల్లారెడ్డి, సురేందర్ నాయక్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -