Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు..

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు..

- Advertisement -

మాచారెడ్డి సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్ 
అన్నారంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం 
నవతెలంగాణ-రామారెడ్డి 

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని బుధవారం మాచారెడ్డి సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. మండలంలోని అన్నారంలో వరి కొనుగోలు కేంద్రాన్ని , వరి ధాన్యాన్ని ఆరబెట్టే మిషను మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వ గిట్టుబాటు ధర అందిస్తున్న సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాలలోనే రైతులు విక్రయించాలని, సన్న రకానికి క్వింటాలుకు రూ 500 గుర్తు చేశారు. కార్యక్రమంలో సీఈఓ చంద్రారెడ్డి, నాయకులు మద్దికుంట దయానంద్, గంగారెడ్డి, సల్మాన్, కీసరి లక్ష్మణ్, దేవదాసు, చంద్రం, వడ్ల బాల నర్సు, రవి నాయక్ , రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -