Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రైతులు యూరియాపై ఆందోళన చెందొద్దు

రైతులు యూరియాపై ఆందోళన చెందొద్దు

- Advertisement -

– రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
– చారకొండ సింగిల్ విండో చైర్మన్ జెల్ల గురువయ్య గౌడ్
నవతెలంగాణ – చారకొండ

రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రైతులు యూరియా పై ఎలాంటి ఆందోళన చెందొద్దని చారకొండ సింగిల్ విండో చైర్మన్ జెల్ల గురువయ్య గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. మండలంలోని రైతులు గత ఏడాది కంటే ఈ ఏడాది పంట సాగు ఎక్కువగా చేశారని చెప్పారు.

గత ఏడాది 4650 బస్తాలు 209 మెట్రిక్ టన్నుల యూరియ సరఫరా చేయడం జరిగిందని, ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారం వరకు 6250 బస్తాలు 281 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని వివరించారు. మండలంలో ఎలాంటి యూరియా కొరత లేదని, కొంత ఆన్లైన్ కారణంగా యూరియా సరఫరా ఆలస్యం అవుతుందని చెప్పారు. నానో ద్రవ యూరియా పై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారని, నానో ద్రవ యూరియా వల్ల మంచి ఫలితాలు వస్తుందని చెప్పారు. రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో సీఈవో భూత్పూర్ వెంకటయ్య, సిబ్బంది భీమయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad