నవతెలంగాణ -ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ తో పాటు వివిధ గ్రామాల్లోని రైతులు వానాకాలంలో సాగు చేస్తున్న సోయా- పత్తి-మొక్కజొన్న-వరితో పాటు ఇతర పంటల వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని ముధోల్ ఏఈఓ సందేశ్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్లోని కొలిగల్లి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పంటల వివరాల నమోదుతో రైతులు పంటలు విక్రయించే సమయంలో ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు. అన్ని రకాల పంటలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తీసుకుంటదని తెలిపారు. రైతులు సాగు చేసే భూమికి రైతు భరోసా వస్తుందని వెల్లడించారు. రైతులు తాము సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.
రైతులు పంటల వివరాలను నమోదు చేసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES