స్లాట్ బుక్ చేయకుండా పత్తి కొనుగోలు జరగదు
పరకాల వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి
నవతెలంగాణ – పరకాల
రైతులు ఖచ్చితంగా ‘కపాస్ కిసాన్యాప్’లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పరకాల వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కె. జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం నవతెలంగాణ పత్రిక ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ పత్తి రైతు తాను పండించిన పంట వివరాలను కంపాస్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ యాప్ ను ప్లే స్టోర్ నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పంట వివరాలు నమోదు చేయాలో రైతులు అందుబాటులో ఉన్న ఏఈఓ లను కలిసి అవగాహన పొందవచ్చు అన్నారు. పరకాల డివిజన్లోని శాయంపేట, ఆత్మకూరు, దామెర, నడికూడ, పరకాల మండలాలలోని రైతులకు ఆయా గ్రామాలలో రైతు వేదికల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ విధానం ద్వారా రైతులే స్వయంగా సిసిఐ వద్ద తమ పత్తి పంటను విక్రయించి మద్దతు ధర పొందవచ్చు అన్నారు. వారు తీసుకొచ్చిన పంటను సీసీఐ తూకం వేయనుందని, రైతులు కపాస్ ఇసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేయకుండా గతంలో మాదిరిగా నేరుగా పత్తిని తీసుకొస్తే కొనుగోలు చేయకుండా వాపస్ పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈసారి ప్రభుత్వం నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేసి దళారుల మోసాలకు బ్రేక్వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. గతేడాది పంట పండించిన రైతుల కంటే మధ్య దళారులే ఎక్కువ పత్తిని అమ్మినట్లు ఫిర్యాదులు రావడంతో సీసీఐ నేరుగా రైతులే తమ పంటను విక్రయించుకునేలా చర్యలు చేపట్టిందిహని. కపాస్ కిసాన్ యాప్‌లో పట్టాదారు పాసుబుక్ ఆప్‌లోడ్చేయాలని, ఫోన్ నంబర్ కూడా ఆధార్‌కు లింక్చేసుకుని ఓటీపీ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని రైతులకు సూచనలు చేస్తున్నది.రైతులు తమ వద్ద సరైన ఫోన్ నెంబర్ లేనట్లయితే ఏఈఓ లను సంప్రదించి సరైన ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాలన్నారు.
మొదలైన కొనుగోళ్ళు
సీసీఐ ద్వారా రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం రైతులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. రైతు పండించిన కిలో పత్తి కూడా కానడం జరుగుతుందని వ్యవసాయ శాఖ, సీసీఐ అధికారులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. దళారుల వద్దకు వెళ్లవద్దని స్థానిక అధికారులు ప్రచారం చేపట్టారు. తేమ విషయంలోనూ నిబంధనలు పాటించక తప్పదని, తడిసిన పత్తి తీసుకొస్తే తాము తీసుకోబోమని సీసీఐ చెబుతోంది. కొందరు తూకం బాగా రావాలనే అత్యాశతో పత్తిపై నీళ్లు చల్లే అలవాటు మానుకోవాలని సూచిస్తోంది. పత్తి రైతులు దళారులను ఆశ్రయించ వద్దని, వారికి పంటను విక్రయించిన తర్వాత వారు నగదు ఇవ్వడం లేదని ఇబ్బందులకు గురికావద్దని సీసీఐ అధికారులు కోరుతున్నారు.