నవతెలంగాణ- మద్నూర్
డోంగ్లి మండలంలో రైతులు పండించిన వరి ధాన్యం సోయా పంట మద్దతు ధర కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం పరచుకోవాలని, దళారులకు అమ్ముకొని వ్యవసాయదారులు మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు వ్యవసాయ రైతులను కోరారు. సోమవారం డోంగ్లి మండలంలోని దోతి గ్రామంలో వరి ధాన్యం మద్దతు ధర కేంద్రాన్ని డోంగ్లి మండల కేంద్రంలో సోయా పంట మద్దతు ధర కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులను విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సంక్షేమం కోసం రైతులకు ఆదుకునేందుకు మద్దతు ధర కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యం గాని, సోయా పంట గాని, మద్దతు ధర కేంద్రాల్లోని అమ్ముకోవాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రయివేట్ పరంగా అమ్ముకొని మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం మహిళా సంఘాల సభ్యులు, రెవిన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, రైతులు, తదితరలు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



