Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలురెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

మండల తహశీల్దార్ రవికుమార్ 
నవతెలంగాణ – మల్హర్ రావు
: భూభారతి చట్టం 2025 అమలులో భాగంగా జూన్ 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, ఈ సదస్సులను రైతులు, భూ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని  కాటారం తహశీల్దార్ నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ సదస్సులో భూ యజమానులు రైతులు తమ భూమి రికార్డుల యందు ఏమైనా తప్పులు ఉన్న లేదా అర్హత ఉండి రెవెన్యూ రికార్డుల యందు పేర్లు నమోదు కాకపోయినా,ఏ ఇతర భూ సమస్యలున్న ఈ నెల 3 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులో రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకుంటే వాటిని పరిశీలించి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సదస్సులు ఇలా… 3న తాడిచెర్ల రైతు వేదికలో, 4న మల్లారం జిల్లా పరిషత్ పాఠశాలలో, 5న చిన్నతూండ్ల గ్రామపంచాయితిలో, 6న దుబ్బపేట గ్రామపంచాయితిలో, దబ్బగట్టు ప్రాథమిక పాఠశాలలో, 9న పెద్దతూoడ్ల గ్రామపంచాయితిలో, 10న వళ్లెంకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో, 11న కొండంపేట గ్రామపంచాయితిలో, 12న ఎడ్లపల్లి గ్రామపంచాయితిలో, 13న రుద్రారం రైతువేదికలో, 16న చిగురుపల్లి,దోమల మాదరం పాఠశాలల్లో,17న శాత్రజ్ పల్లి,కాపురం పాఠశాలల్లో, 18న ఆన్ సాన్ పల్లి గ్రామపంచాయితిలో, 19న నాచారం గ్రామపంచాయితిలో, తాడ్వాయిలో పాఠశాలలో, 20న మల్లంపల్లి గ్రామపంచాయితిలో  జరగనున్నట్లుగా తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad