– మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
తెలంగాణ ప్రభుత్వ అధికారిక వ్యవసాయశాఖ వాట్సాప్ ఛానల్ ను రైతులు వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ కోరారు. రైతు సోదరులకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్, డైరెక్టర్ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు.ఈ ఛానల్ ద్వారా సమయానుకూలమైన, నమ్మకమైన, ఉపయోగకరమైన వ్యవసాయ సమాచారం నేరుగా రైతుల చేతుల్లోకి చేరుతుందన్నారు.వాట్సాప్ ఛానల్ ద్వారా ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ వివరాలు, పంటల సంరక్షణ, సీజనల్ సూచనలు ఎప్పటికప్పుడు ఫోన్లోనే రైతులు చూసుకోవచ్చు అన్నారు.
వాతావరణ హెచ్చరికలు, కీటక నియంత్రణ మార్గదర్శకాలు, మార్కెట్ ధరలు, శిక్షణా కార్యక్రమాల అప్‌డేట్లు, రైతు నేస్తం కార్యక్రమాల షెడ్యూల్, రాష్ట్రంలోని 1600 రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ యూనిట్స్‌లో నిర్వహించబోయే అంశాలు రైతులు నేరుగా తెలుసుకోవచ్చన్నారు. మనమంతా కలిసి ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయం పెంపు, స్థిరమైన వ్యవసాయం వైపు ముందుకు సాగేందుకు రైతులు వాట్సాప్ ఛానల్ ను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ కోరారు.
వ్యవసాయశాఖ వాట్సాప్ ఛానల్ ను రైతులు వినియోగించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES