Tuesday, March 17, 2026
E-PAPER
Homeఖమ్మంప్రకృతి వ్యవసాయం వైపుగా రైతుల అడుగులు

ప్రకృతి వ్యవసాయం వైపుగా రైతుల అడుగులు

- Advertisement -

– రైతు నేస్తం కార్యక్రమంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ప్రారంభం
– వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
నవతెలంగాణ – అశ్వారావుపేట

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేంద్రమోహన్, డైరెక్టర్ డాక్టర్ గోపి పాల్గొన్నారు.

అనంతారం, నందిపాడు గ్రామాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతులు నారాయణపురం రైతు వేదిక లో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.ఈ సందర్భంగా రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లు పంపిణీ చేశారు.

ముఖ్యాంశాలు:

ప్రకృతి వ్యవసాయం పై రైతులకు అవగాహన
రైతులకు ప్రత్యేక కిట్ల పంపిణీ
ప్రభుత్వ పథకాలపై వివరాలు
బీజామృతం తయారీపై ప్రదర్శన
శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచన

అశ్వారావుపేట డివిజనల్ ఏడి పెంటేల రవికుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఫార్మర్స్ రిజిస్ట్రీ చేయించుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు రైతు భరోసా, రైతు బీమా, పీఎం కిసాన్ పథకాల గురించి వివరించారు. నారాయణపురం సర్పంచ్ మడివి కుమారి మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

రైతు అనుభవం:

ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు దారా ప్రసాద్ తన అనుభవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు.  వెంకటేశ్వరరావు బీజామృతం తయారీ విధానాన్ని ప్రాయోగికంగా చూపించి రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు పెంటేల రవికుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు రవీంద్రరావు, సూరిబాబు, షకీరా భాను, నాబార్డ్ ప్రతినిధి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -