నవతెలంగాణ – మల్హర్ రావు
గత నాలుగైదు రోజులుగా వాతావరణంలో అన్యుహ్యమైన మార్పులు రావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉదయాన్నే పొగమంచు కమ్మేయడంతో రహదారులపై వెళ్లే వాహనాలు కనిపించడం లేదు. పొద్దున కారుమబ్బులు రావడంతో రైతు గుండెల్లో గుబులు మొదలవుతుంది. అలాగే పగలు ఎండ…రాత్రివేళలో వర్షం పడడంతో రైతులుమరింతగా అయోమయానికి గురవుతున్నారు. వరి, పత్తి పంటలు ఏపుగా పెరగడంతో పెట్టుబడులకు వెనుకడుగు వేయకుండా రైతులు పెట్టారు. వరి పంట కోత దశకు,పత్తి చేతికి వచ్చే సరికి అకాల వర్షాలతో వరి నేలకొరిగింది. పత్తి చెనుపై తడిసి నల్లబారింది. పంట ఆరబెడదామంటే ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుంది.దీంతో గింజలు మొలకెత్తు తాయని లబోదిబోమంటున్నారు. పంట పూర్తికాలానికి ఇంకా ఇరవై రోజులు ఉండగా వరి నేలకొరగడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుందని వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో కల్లాల వద్ద ధాన్యం ఆరబోసిన రైతుల దుస్థితి మరీ దారుణంగా మారింది. పగలు ఆరబోయడం రాత్రి కుప్పలు పోయడం తలనొప్పిగా మారింది.వర్షాలు రైతులను ఇబ్బందిపాలు చేస్తోంది.
వాతావరణ మార్పులతో రైతన్న ఆగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



