Friday, December 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయూరియా కోసం రైతన్న కష్టాలు

యూరియా కోసం రైతన్న కష్టాలు

- Advertisement -

స్టేషన్‌ ఘనపూర్‌లో బారులు తీరిన రైతులు

నవతెలంగాణ – స్టేషన్‌ ఘనపూర్‌
రోజురోజుకూ యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. యూరియా వచ్చిందని తెలిస్తే చాలు వ్యవసాయ పనులు విడిచి రోజంతా భోజనం చేయకుండా వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ పట్టణకేంద్రంలోని శివునిపల్లిలో ఓ ఎరువుల దుకాణంలో యూరియా రావడంతో గురువారం మండలంలోని రైతులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి క్యూలో ఉన్న రైతులు నీరసంతో నిలబడలేక అసహనం వ్యక్తం చేశారు. ”యాప్‌ ద్వారా నమోదు చేసుకున్నాం.. ఈరోజు యూరియా బస్తాలు తీసుకోకపోతే ఎలాగా.. ఈ పాడు ప్రభుత్వాలు రైతులను అరిగోస పెడుతున్నాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా బస్తాలు తీసుకెళ్దామని వస్తే, ఎరువుల దుకాణం యాజమానులు ఒక ఎరువు బస్తాకు అదనంగా ఏదైనా కొనుగోలు చేస్తేనే ఇస్తామని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, లేదంటే జాతీయ రహదారిపై ఆందోళన చేపడతామని రైతులు డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -