Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలి..

భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలి..

- Advertisement -

సీసీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్ళేం కృష్ణ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

గంధమల్ల రిజర్వాయర్లో పూర్తిగా భూమి కోల్పోయిన రైతులకు ప్రభుత్వ భూమి ఇచ్చి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున తుర్కపల్లి మండలo గంధమల్ల గ్రామంలో రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వ భూమి ఇవ్వాలని కలెక్టరేట్ కార్యాలయంలో  జిల్లా కలెక్టర్ హనుమంత రావు కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కళ్లెం కృష్ణ మాట్లాడుతూ.. గంధ మల్ల ప్రాజెక్టు నిర్మాణం కొరకు భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం  ఇచ్చినప్పటికీ ఆ నష్టపరిహారంతో బయట ఒక ఎకరం కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉన్నదని అన్నారు.

రిజర్వాయర్లో పూర్తిగా భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 473, 461 సుమారు 100 ఎకరాలు పైగా భూమి ఉన్నందున ఆ ప్రభుత్వ భూమిలో పూర్తిగా భూమి కోల్పోయిన రైతులకు భూమి ఇచ్చి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కారిక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ ఇమ్రాన్, మండల కార్యదర్శి సిలివేరు దుర్గయ్య, సహాయ కార్యదర్శి గుంటిపల్లి సత్తయ్య, సిపిఐ నాయకులు కలకుంట్ల సత్యనారాయణ, రైతులు బాదిని సుదర్శన్, బోల్ల జహంగీర్,  జక్కుల బాలయ్య, కొత్తపల్లి బాల నరసయ్య, బాధిని బాలయ్య, కొత్తపల్లి రాజు కుమ్మం నరసింహులు, కొత్తపల్లి వెంకటేశం, బోళ్ల బిక్షపతి చిరిగిరి నర్సయ్య, జక్కుల వెంకమ్మ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -