- Advertisement -
- – మూడు రోజులుగా యూరియా కోసం తిరిగి రైతు వేదిక ముందు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు
నవతెలంగాణ – మనోహరాబాద్ : రైతులు ఏరియా కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు పనులను వదులుకొని తిరుగుతున్నారు. శనివారం తూప్రాన్ రైతు వేదిక వద్ద యూరియా బస్తా కోసం టోకెన్లు ఇస్తున్నట్లు తెలవడంతో రైతుల ఒక్కసారిగా రైతు వేదిక వద్దకు వచ్చారు. రైతులు అధికంగా ఉండడంతో లైన్ లో చెప్పులను ఉంచారు. మూడు రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నామని తమకు ఎలాగైనా యూరియా కావాలంటూ రైతులు రైతు వేదిక ముందు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా సోమవారం వస్తుందని అప్పుడు యూరియాను ఇస్తామని వ్యవసాయ అధికారులు తెలపడంతో వెన్ను తిరిగి వెళ్ళిపోయారు.
- Advertisement -