కాంటాలు కావట్లేదని ఆందోళన
నవతెలంగాణ – పెద్దవంగర: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కాంటాలు కావట్లేదని, రైతులు ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ.. రైతులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రంలో సకాలంలో ధాన్యం కాంటాలు కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజులైన ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు లారీల కొరత, మరోవైపు వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరారు.
ధాన్యానికి నిప్పు పెట్టిన రైతులు ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES