- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండలంలో నీటి ప్రభావంతో, ఇసుక మెట్టలు పెట్టి వేల ఎకరాల పంట నష్టపోయిందని మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి అన్నారు. మండలంలోని పోసానిపేట తో పాటు వివిధ గ్రామాల్లో నష్టపోయిన పంటలను రైతులతో కలిసి పరిశీలించారు.శనివారం ఆయన మాట్లాడుతూ… మండలంలోని 18 గ్రామాల్లో, ప్రతి గ్రామంలో చెరువులు, వాగులు ఉండడంతో భారీ వరద తో అనేకమంది రైతుల పొలాల్లో ఇసుక దిబ్బలు, నీటికి కోతకు గురై రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని నమోదు చేసి, రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -