Thursday, May 22, 2025
Homeఆదిలాబాద్సమీకృత వ్యవసాయంతో రైతులకు లాభాలు: కలెక్టర్ అభిలాష అభినవ్

సమీకృత వ్యవసాయంతో రైతులకు లాభాలు: కలెక్టర్ అభిలాష అభినవ్

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ 
 రైతుల కోసం ప్రవేశపెట్టిన సమీకృత వ్యవసాయ క్షేత్రాలతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మండలంలోని తరోడ గ్రామ శివార్ లో మహిళ రైతు అర్షియా బేగం దంపతులు సాగు చేస్తున్న సమీకృత వ్యవసాయ క్షేత్రం ను బుధవారం  కలెక్టర్  సందర్శించారు.  రైతుదంపతులతో  మాట్లాడి సమీకృత వ్యవసాయం గురించి, ప్రయోజనాలు,  అనుసరించిన  విధానాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతు తన వ్యవసాయ క్షేత్రంలో చేపల పెంపకం,పశువుల పాక,నాడెపు కంపోస్ట్, ఫారం ఫండ్,అజోల ఉత్పత్తి లను ఐకెపి, జాతీయ ఉపాధి హామీ పథకం సహకారంతో  నిర్మించుకున్నారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని,రసాయనిక ఎరువులను తగ్గిస్తూ  తక్కువ  పెట్టుబడులతో ఎక్కువ రాబడి వచ్చేవిధంగా  సాగుచేస్తున్న మహిళ రైతు దంపతులను కలెక్టర్ అభినందించారు.ప్రతి రైతు తక్కువ వ్యవసాయ భూమి లో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందే విధంగా ఉపాధి హామీ పథకాన్ని  రైతులు సద్వినియోగం చేసుకోవాలని  కలెక్టర్ కోరారు. ఆసక్తి గల రైతులు  ఈ రైతు పథకాలతో లబ్ధి పొందాలన్నారు.చేపల పెంపకంతో లాభం తో పాటు భూగర్భ జలాలు పెంపొందించవచ్చు అని అన్నారు.రెండు గుంటల భూమి లో చేపల పెంపకంతో సంవత్సరం కు సుమారు 4లక్షల ఆదాయం సంపాదించవచ్చని అన్నారు.తరోడా రైతు  ఉపాధి హామీ పథకం తో పాటు ఐకేపీ నుండి తీసుకున్న రుణం తో  అన్ని రకాల పంటలు కూరగాయలు, పశువులు,చేపల పెంపకం. చేయటం అభినందనీయమన్నారు.మిగతా రైతులకు ప్రోత్సహించేందుకు వారిని ఈ సమీకృత క్షేత్రాన్ని కి తీసుకువచ్చి అవగాహన కల్పిస్తామన్నారు.ఈసందర్భంగా  మట్టి నామున పరీక్ష  యంత్రం  తో మట్టి పరీక్ష విధానం ను కలెక్టర్  పరిశీలించారు‌. రైతులు తమ పంట భూములలో తప్పనిసరిగా మట్టి పరీక్ష చేయించుకోవాలని సూచించారు‌. ఈ కార్యక్రమంలో డిఆర్ డివో విజయ లక్ష్మి,ఆర్డీవో కోమల్ రెడ్డి,తహశీల్దార్ శ్రీలత, ఎంపిడిఓ శివకుమార్,ఎపిఓ శిరీషారెడ్డి,ఎపియం గురుచరణ్, ఉపాధి సిబ్బంది యోగేష్, బాస్కర్ రెడ్డి, దేవి దాస్,సీసీ లు పోశెట్టి,వందేమాతరం,సూర్యకాంత్, విఓఎ ఓమేష్, ఫీల్డ్ అసిస్టెంట్, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -