Wednesday, March 4, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

ఘోర ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీలోని చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలోని దండపల్లి క్రాస్‌ వద్ద బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ముందువెళ్తున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను మోహన్‌దాస్‌ (71), నాగరాజారావు (61), కుసుమ (61), జయంతి (59), పూజ (33)గా గుర్తించారు. వీరంతా బెంగళూరులోని రాజాజీనగర్‌ నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గంగవరం సీఐ రామ్‌భూపాల్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -