Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బాన్సువాడలో ఘోర రోడ్డు ప్రమాదం 

బాన్సువాడలో ఘోర రోడ్డు ప్రమాదం 

- Advertisement -

ఒకరు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు 
పోలీస్ స్టేషన్ ఎదుట శవంతో ధర్నా 
నవతెలంగాణ – బాన్సువాడ నసురుల్లాబాద్ 

ఆర్టీసీ బస్సు టీ.వీ.ఎస్. ఎక్సెల్ ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాన్స్వాడ మండలం బోర్లం క్యాంపు శివారు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు కొట్టిన సంఘటనలో గాంధారి మండలం సోమ్ల నాయక్ తండా కు చెందిన రమావత్ గోవింద్ అక్కడికి అక్కడే మృతి చెందగా రమావత్ రాములుకు మెరుగైన చికిత్స నిమిత్తం నిజామబాద్ ఆస్పత్రికి తరలించారు. రాములు పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

బాన్సువాడ శివారు ప్రాంతంలో బాన్సువాడ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారని భయపడి దారి మళ్లించడంతో ఎదురుగా బాన్సువాడ నుండి కామారెడ్డి వెళ్లే బస్సును ఢీ కొనడంతో సంఘటన జరిగిందని, ఈ సంఘటనకు పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆగ్రహ ఆవేశాలతో మృత దేహాన్ని పోలీస్ స్టేషన్ ముందు ఉంచి ధర్నా నిర్వహించారు. వీరితో పాటు ఇంకో బైక్ పైవస్తున్న ఇద్దరు వ్యక్తులు మొహమ్మద్ నగర్ మండలం, కోమలంచ గ్రామానికి చెందిన హన్మండ్లు , మరియు గంగాధర్ లను బస్సు ఢీ కొనడం తో తీవ్ర గాయాలై బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ పోలీసులు తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad