Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంశ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -

అదుపుతప్పి లోయలోకి పడిన బస్సు
15 మంది మృతి.. 16 మందికి గాయాలు


కొలంబో : శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 30 మంది ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు కొండపై నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులు మృతి చెందారు. 16 మంది గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని పోలీసు అధికారి తెలిపారు. ఘటనకు సంబంధించి పోలీసు అధికారి ఫెడ్రిక్‌ వూట్లర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ”కొలంబోకి తూర్పున 280 కిలోమీటర్ల దూరంలో వెల్లవాయ పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో 15 మంది ప్రయాణీకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఐదుగురు చిన్నారులతో సహా 16 మంది గాయాలపాలయ్యారు” అని ఫెడ్రిక్‌ చెప్పారు. డ్రైవర్‌ బస్సును అతివేగంతో నడపడంతో అదుపుతప్పి మరొక వాహనాన్ని ఢకొీన్నది. ఆ తర్వాత బస్సు గార్డురెయిల్స్‌ను తాకి కొండపై నుంచి బోల్తాపడి లోయలోకి పడిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వూట్లర్‌ చెప్పారు. లోయలో పడిన బస్సు పూర్తిగా ధ్వంసమైనట్టు స్థానిక మీడియా ఫుటేజీల్లో కనిపించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad