Thursday, January 15, 2026
E-PAPER
Homeజాతీయంతమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు సజీవ దహనం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు సజీవ దహనం

- Advertisement -

నవతెలంగాణ చెన్నై: పండగ పూట తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి ముగ్గురు అక్కడికిక్కడే సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

సెలవుల నేపథ్యంలో యువకులు చెన్నై నుండి మున్నార్ ట్రిప్ కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని జాతీయ రహదారిపై కారు కంట్రోల్ తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి ముగ్గురు అక్కడికిక్కడే సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అదృష్టవశాత్తు ఇద్దరు యువకులు బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని.. మృతదేహాలను పోస్ట్ మార్టం కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -