Wednesday, October 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 63 మంది మృతి

ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 63 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉగాండాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గులు రోడ్డుపై పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 63 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గులు హైవేపై ఓ బస్సు డ్రైవర్‌ లారీని ఓవర్‌టేక్‌ చేస్తూ.. ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. వెంటనే డ్రైవర్‌ బస్సును మరో వైపునకు తిప్పడడంతో పక్కన.. ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో నియంత్రణ కోల్పోయిన పలు వాహనాలు వరుసగా ఢీకొట్టుకొని బోల్తా పడ్డాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి, గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అధికారులు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్‌ టేకింగ్‌ చేస్తుండమేనని.. వాహనదారులు రోడ్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రజలను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -