నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఒక్కరూ మృతి చెందిన సంఘటన హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అక్కన్నపేట మండలం జనగామ గ్రామానికి చెందిన మోటె అజయ్ (30) మృతి చెందాడు. తోటపల్లి గ్రామ శివారులో బొగ్గు ట్రాక్టర్ చెడిపోవడంతో రోడ్డుపై నిలిపించారు. హుస్నాబాద్ నుండి ఇంటికి వెళ్తున్న అజయ్ రాత్రి సమయంలో ముందున్న ట్రాక్టర్ కనబడక వెనక నుండి ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య నీరజ , కూతురు కుమారుడు ఉన్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


