- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :: జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ నవాబ్ పేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బైకును ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఒకరు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -



