- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గోవిందుపల్లె గ్రామానికి చెందిన అల్లూరి రాఘవరెడ్డి-సుగుణ దంపతులు బైక్ పై గొల్లపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెల్గటూర్ మండలంలోని రాంనూర్ కు చెందిన బిదారి శ్రీకాంత్ గొల్లపల్లి మీదుగా వెల్గటూర్ వైపు వెళ్తున్నాడు. రెండు బైకులు ఢీకొనడంతో రాఘవరెడ్డి, శ్రీకాంత్ మృతి చెందారు.
- Advertisement -