- Advertisement -
నవతెలంగాణ-కాటారం
వరంగల్ జిల్లా కాటారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగారం ఎక్స్ రోడ్డు (దేవరాంపల్లి) వద్ద గురువారం ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అటుగా వెళ్తున్న స్థానికులు 108 కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
- Advertisement -



