- Advertisement -
నవతెలంగాణ నారాయణపేట: తెలంగాణలోని నారాయణపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. భార్య కాపురానికి రావడం లేదనే కోపంతో పిల్లలను తండ్రి శివరాములు ఉరివేసి హత్య చేశాడు. అనంతరం యాపల్ చెరువులో వారి మృతదేహాలను పడేసి.. విద్యుత్ తీగలు పట్టుకుని చనిపోయేందుకు యత్నించి విఫలమయ్యాడు. అనంతరం పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. శివరాములును స్థానికులు మహాబుబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- Advertisement -



