Thursday, January 29, 2026
E-PAPER
Homeక్రైమ్ఇద్దరు పిల్లలను చంపి కాల్వలో పడేసిన తండ్రి

ఇద్దరు పిల్లలను చంపి కాల్వలో పడేసిన తండ్రి

- Advertisement -

– ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం
– నారాయణపేట జిల్లా మరికల్‌ పరిధిలో ఘటన
నవ తెలంగాణ- మరికల్‌

భార్య కాపురానికి రావడం లేదన్న మనస్తాపంతో ఇద్దరు పిల్లలకు ఊరేసి చంపి.. ఆ తర్వాత తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్‌ మండల పరిధి తీలేరు గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. తిలేరు గ్రామానికి చెందిన చాకలి శివరాములు దంపతులకు ఇద్దరు పిల్లలు రిత్విక(8), చైతన్య(6). అయితే కుటుంబంలో మనస్పర్థల వల్ల ఆయన భార్య కాపురానికి రావడం లేదు. దాంతో మనస్తాపానికి గురైన శివరాములు మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపి మృతదేహాలను గ్రామ శివారులో ఉన్న కోయిల్‌సాగర్‌ కాల్వలో పడేశాడు. ఆ తర్వాత ఆయన గుళికల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉప సర్పంచ్‌ అశోక్‌కుమార్‌ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రాము వెంటనే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి కాల్వలో నుంచి పిల్లల మృతదేహాలను బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆస్పత్రికు తరలించారు. శివరాములు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సర్పంచ్‌ మురారి, ఉపసర్పంచ్‌ అశోక్‌ కుమార్‌, గ్రామస్తులు పిల్లల మృతదేహాలను చూసి చలించిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -