కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన
పోలీసుల అదుపులో నిందితుడు
కుటుంబ కలహాలే కారణం.?
నవతెలంగాణ- కరీంనగర్ క్రైమ్
కుటుంబ కలహాలు.. చిన్నారుల ప్రాణం తీసేవరకు వెళ్తున్నాయి.. రాష్ట్రంలో వరుస ఘటనలే ఇందుకు ఉదాహరణ… తాజాగా కరీంనగర్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఇద్దరు కవల కుమార్తెలైన చిన్నారులను శుక్రవారం తండ్రి బావిలో ముంచి చంపేశాడు. ఈ హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ గ్రామానికి చెందిన కచ్చు శ్రీశైలం-మౌనిక దంపతులకు ఇద్దరు కవల కుమార్తెలు సంతానం.
అయితే, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం పిల్లలు గీతాంశీ, గీతాన్విక(4)ను గ్రామ సమీపంలోని పొలానికి తీసుకెళ్లాడు. చిన్నారులు ఇద్దరిని బావిలో దించి ముంచి హత్య చేశాడు. అతనూ దూకాడు. కానీ ఈత రావడంతో మళ్లీ బయటకు వచ్చాడు. గ్రామస్తులు గమనించి శ్రీశైలంను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత బావిలో వెతకగా గీతాంశీ మృతదేహం లభ్యమైంది. మరో చిన్నారి గీతాన్విక కోసం గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న ఏసీపీ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, గ్రామంలో శాంతి భద్రతల దృష్ట్యా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇద్దరు కూతుళ్లను బావిలో వేసి చంపిన తండ్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



