Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు 

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర : లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలను మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్లబ్ సభ్యులు ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి తండ్రి శ్రీనివాస్ రెడ్డి, జలగం సతీష్ తండ్రి చంద్రయ్య లను శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఏదునూరి సిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నవమాసాలు మోసి బిడ్డను కనే తల్లిది పేగు బంధమైతే.. ఆ బంధానికి బాధ్యత వహిస్తూ, భారమంతా తాను మోస్తూ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాడు నాన్న. తను ఎలా ఉన్నా సరే.. తన పిల్లలు మాత్రం బాగుండాలని కోరుకుంటాడన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. సేవలు అందించడంలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ముత్తినేని శ్రీనివాస్, తంగళ్లపల్లి మల్లికార్జున చారి, అనపురం రవి గౌడ్, రాపోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad