Sunday, July 27, 2025
E-PAPER
Homeకరీంనగర్దాతలు స్పందిస్తేనే.. తండ్రి అంత్యక్రియలు

దాతలు స్పందిస్తేనే.. తండ్రి అంత్యక్రియలు

- Advertisement -

-రాయికల్‌లో కన్నీటి విన్నపం
– సాయం కోసం వేచి ఉన్న ఇద్దరు కూతుళ్లు
నవతెలంగాణ – రాయికల్

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని కోరుట్ల క్రాసింగ్ వద్ద రోడ్డు పక్కన గల ఓ కూలీపోయిన ఇంటిలో అద్దెకు జీవించే జాంగిర్ కుటుంబం ప్రస్తుతం తీవ్రమైన విషాదంలో కొట్టుమిట్టాడుతోంది. సీస కమ్మరి వృత్తితో కుటుంబాన్ని పోషిస్తున్న నరాల జాంగిర్ హఠాన్మరణంతో మరణించారు. ఆయన ఇద్దరు కూతుళ్లు నాగమణి, నాగేశ్వరి కన్నీటి విన్నపంతో దాతల ఆర్థిక సాయానికి ఎదురుచూస్తున్నారు.

జాంగిర్ భార్య అనసూయ కిడ్నీ వ్యాధి సమస్యలతో పోరాడుతుండగా.. కుమార్తెల పెళ్లిళ్లు కూడా చేయలేని పరిస్థితిలో, కూలిపనులపై ఆధారపడుతూ జీవనం సాగించేవాడు. గత సంవత్సరం కొడుకును కోల్పోయిన ఈ కుటుంబానికి ఇప్పుడు తండ్రి మరణం మరింత విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ పెద్దను కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుమార్తెలు తండ్రి అంత్యక్రియలు జరిపేందుకు సైతం డబ్బు లేక కన్నీటిలో మునిగి దాతల వైపు ఆశగా చూస్తున్నారు.

తండ్రి మృతదేహం ముందు కూర్చుని ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేస్తారా… అంటూ వారిద్దరూ విన్నవిస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. మానవత్వాన్ని చాటుకుని, ఈ కుటుంబానికి అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్థిక సహాయం చేసే దాతలు నర్రా అనసూయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాయికల్ బ్రాంచ్ ఖాతా నెంబరు 42050569724 ఐఎఫ్ సి కోడ్ 20264 యందు సహాయం చేయాలని, వస్తు రూపేనా నేరుగా అనసూయ 9177748525 నెంబర్ యందు సంప్రదించవచ్చని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -