Thursday, January 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదసరా బరిలో 'ఫౌజీ'

దసరా బరిలో ‘ఫౌజీ’

- Advertisement -

హీరో ప్రభాస్‌, దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో రాబోతున్న పాన్‌-ఇండియా ప్రాజెక్ట్‌ ‘ఫౌజీ’. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాణంలో టి-సిరీస్‌ గుల్షన్‌ కుమార్‌, భూషణ్‌ కుమార్‌ సమర్పిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దసరా పండుగ సందర్భంగా ఈసినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. షూటింగ్‌ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూ షెడ్యూల్‌ కొనసాగనుంది. ఈ సినిమా అత్యంత గ్రాండ్‌గా రూపుదిద్దుకుంటోంది. అంతేకాదు విజువల్‌ వండర్‌గా ఉండబోతోంది. ఎమోషన్‌, గ్రాండ్యూర్‌కి పేరుపొందిన దర్శకుడు హను రాఘవపూడి ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్‌ ఫుల్‌ అవతార్‌లో ప్రభాస్‌ని చూపించబోతున్నారు.

ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తోంది. అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, జయప్రద, భాను చందర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌ మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై వరల్డ్‌ క్లాస్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: హను రాఘవపూడి, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌, సహ నిర్మాత (టీ-సిరీస్‌) : శివ చనన, ప్రెసిడెంట్‌ (టీ-సిరీస్‌) : నీరజ్‌ కళ్యాణ్‌, డీఓపీ : సుదీప్‌ ఛటర్జీ, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అనిల్‌ విలాస్‌ జాదవ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -