Friday, December 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా ఉపాధ్యాయుల్లో భయం.. భయం

అమెరికా ఉపాధ్యాయుల్లో భయం.. భయం

- Advertisement -

స్వదేశాలకు తిప్పి పంపుతారేమోనని ఆందోళన
విద్యార్థులు నష్టపోతారంటున్న విద్యావేత్తలు


వాషింగ్టన్‌ డీసీ : అమెరికా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో వాటిని విదేశీయులతో భర్తీ చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తోంది. అయితే అమెరికాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అక్కడ ఉద్యోగాలు చేసేందుకు విదేశీయులు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో వేలాది మంది విదేశీయులు ఎడ్యుకేటర్లుగా పనిచేస్తున్నారు. ఇలా పనిచేస్తున్న విదేశీ ఉపాధ్యాయులు వర్క్‌ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటుంటే అవి తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో వారి భవిష్యత్తు ఆందోళనలో పడుతోంది. అమెరికాలో పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో సుమారు పది శాతం మంది వలసదారులే. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు అమెరికా విదేశాల వైపు చూస్తుండగా, విదేశాలలో జన్మించి అమెరికాలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కొందరు మాత్రం భయాందోళనలకు గురవుతున్నారు. అక్రమ వలసదారుల పేరుతో ట్రంప్‌ ప్రభుత్వం అనేక మందిని బలవంతంగా వారి స్వదేశాలకు తిప్పి పంపుతోంది. అలాంటప్పుడు తమ జీవనభృతికి ముప్పు వాటిల్లుతుందేమోనన్న ఆందోళన అనేక మందిలో వ్యక్తమవుతోంది. వారిలో సుసన్నా ఒకరు.

గ్వాటెమాలాలో నెలకొన్న హింస కారణంగా ఆమె సుమారు దశాబ్ద కాలం క్రితం అమెరికాలో ఆశ్రయం కోరారు. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుసన్నా వర్క్‌ పర్మిట్‌ నవీకరణ కోసం దరఖాస్తు చేసుకోగా దానిని అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఒక్క వారం వ్యవధిలోనే అన్నీ కోల్పోయానని సుసన్నా వాపోయారు. పాఠశాల విద్యార్థులకు బరువెక్కిన గుండెతో వీడ్కోలు చెప్పాల్సి వచ్చిందని ఆమె అన్నారు. 2019లో విడుదలైన నివేదిక ప్రకారం అమెరికాలో 81 లక్షల మంది ఉపాధ్యాయులు ఉండగా వారిలో 8,57,200 మంది వలసదారులే. వీరిలో ప్రీ-స్కూల్‌ నుంచి విశ్వవిద్యాలయాలలో బోధించే ఉపాధ్యాయుల వరకూ ఉన్నారు. 2023-24లో అమెరికా ప్రభుత్వం ఫిలిప్పీన్స్‌, జమైకా, స్పెయిన్‌, కొలంబియా దేశాల నుంచి తాత్కాలిక ఎక్స్ఛేంజ్‌ వీసాలపై 6,716 మంది ఫుల్‌ టైమ్‌ ఉపాధ్యాయులను తీసుకొచ్చింది. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసవాదుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విదేశాలలో జన్మించి అమెరికాలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిపై అనేక పాఠశాలలు ఆధారపడుతున్నాయి. వారిని బలవంతంగా స్వదేశాలకు పంపితే విద్యార్థులు నష్టపోతారని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -