Sunday, November 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరేవంత్‌రెడ్డిలో ఓటమి భయం మొదలైంది

రేవంత్‌రెడ్డిలో ఓటమి భయం మొదలైంది

- Advertisement -

ప్రగతిభవన్‌లో బుల్లెట్‌ ప్రూఫ్‌ కిటికీలున్నాయా? : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో ఓటమి భయం మొదలైందని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జి జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం మానసిక స్థితి దెబ్బతిన్నట్టుందని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి పదవికి ఎసరొచ్చే అవకాశముందన్నారు. నిఘా పెట్టడానికి కేసీఆర్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కడితే రేవంత్‌రెడ్డి అందులో కూర్చుని తమపై నిఘా పెడుతున్నారని అన్నారు. ప్రగతి భవన్‌ లో బుల్లెట్‌ ప్రూఫ్‌ కిటికీలుంటే చూపించాలని డిమాండ్‌ చేశారు.

బుల్లెట్‌ ప్రూఫ్‌ కిటికీలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, సచివాలయ నిర్మాణంపై కమీషన్‌ వేసి విచారణ చేయొచ్చు కదా?అని ప్రశ్నించారు. కిషన్‌ రెడ్డి, రేవంత్‌రెడ్డి పదవుల్లో ఉన్నారు కాబట్టి వారిద్దరే బ్యాడ్‌ బ్రదర్స్‌ అని అన్నారు. ఆ ఇద్దరూ మోడీ శిష్యులని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి భాష మార్చుకోవాలనీ, తెలంగాణ పరువు పోతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్‌, మాజీ ఎమ్మేల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గ్యాదరి కిషోర్‌ కుమార్‌, బూడిద భిక్షమయ్యగౌడ్‌, బీఆర్‌ఎస్‌ నేతలు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -