నవతెలంగాణ కంఠేశ్వర్
నగరంలోని కంటేశ్వర్ బైపాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫెడ్ బ్యాంక్ గోల్డ్ లోన్ కార్యాలయాన్ని బుధవారం నుడా చైర్మన్ కేశ వేణు టిపిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఫెడ్ బ్యాంక్ గోల్డ్ లోన్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఫెడ్ బ్యాంక్ గోల్డ్ లోన్ సంస్థ రీజినల్ మేనేజర్ దిలీప్ కుమార్, ఏరియా మేనేజర్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో 505 బ్రాంచ్ లు, తెలంగాణ రాష్ట్రంలో 39 వ బ్రాంచ్ గా నిజామాబాద్ జిల్లాలో మొదటి బ్రాంచ్ గా కంటేశ్వర్ బైపాస్ లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అతి త్వరలోకామారెడ్డి, ఆర్మూర్, నిర్మల్ లో బ్రాంచ్ లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. హోమ్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్ కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కావున ఈ అవకాశాన్ని నిజామాబాద్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హెడ్ శైలేందర్ వాడే, జోనల్ మేనేజర్ దేవేందర్ వ్యాస్, బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, బ్రాంచ్ సిబ్బంది శ్వేత, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.