Thursday, November 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా జర్నలిస్టులపై ట్రోలింగ్‌కు ఫెడరేషన్‌ ఖండన

మహిళా జర్నలిస్టులపై ట్రోలింగ్‌కు ఫెడరేషన్‌ ఖండన

- Advertisement -

– గట్టి చర్యలు తీసుకోవాలని సర్కారుకు విజ్ఞప్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలంగాణలో మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న అసభ్యకర ట్రోలింగ్‌, బెదిరింపులు, ద్వేషపూరిత ప్రచారాలు, దాడులను అరికట్టాలని పలు జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర కన్వీనర్‌ పి రాంచందర్‌, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, తెలంగాణ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌(టీబీజేఏ) రాష్ట్ర అధ్యక్షురాలు పి రాధిక, ప్రధానకార్యదర్శి జ్యోతిబసు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌ తులసిచందుతో సహా అనేక మంది మహిళా జర్నలిస్టులు ట్రోలింగ్‌ బారిన పడ్డారని గుర్తు చేశారు. ఈ విషయమై రాష్ట్ర మహిళా కమిషన్‌ కూడా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. మీడియాలో మహిళా జర్నలిస్టులు అనేక సవాళ్ల మధ్య పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ట్రోలింగ్‌ అరికట్టడంతోపాటు రక్షణ కల్పించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -