Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయివేట్ విద్యా సంస్థలో ఫీజుల దోపిడీని అరికట్టాలి

ప్రయివేట్ విద్యా సంస్థలో ఫీజుల దోపిడీని అరికట్టాలి

- Advertisement -

డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివరాజ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
: ప్రయివేటు విద్యాసంస్థలు, స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న దోపిడీని అరికట్టాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం  హుస్నాబాద్ లో డివైఎఫ్ఐ సమావేశంలో  మాట్లాడుతూ రాష్ట్ర,జిల్లావ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఆయా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా విద్య సంస్థల ను నిర్వహిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు విద్యాసంస్థల యాజమాన్యం కుమ్మక్కై  ప్రైవేట్ విద్యా సంస్థల పైన తనిఖీలు,దాడులు చేయడం లేదని ఆరోపించారు.ప్రైవేట్ స్కూళ్లలో పాఠ్యపుస్తకాలు టై, బెల్టులు, డ్రెస్సులు విచ్చలవిడిగా అమ్ముతూ వివిధ రకాల ఫీజుల పేరు తోటి విద్యార్థులను,తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్, మాంటోసోర్సీ ( కృష్ణవేణి), ఆల్ ఫోర్స్ స్కూల్స్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ స్కూల్స్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ ను అమలు చేయడం లేదన్నారు . ప్రైవేట్ పాఠశాలల్లో  సొంత సిరీస్ పాఠ్యపుస్తకాలను ముద్రించి, ఆ పాఠ్యపుస్తకాలు  ఎక్కడ కూడా దొరకకుండా చేసి  అధిక ధరలకు అమ్ముతూ వేల రూపాయలు దోచుకుంటున్నారన్నారు. విద్యను వ్యాపారంగా మార్చేసి అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు. స్కూళ్లకు సరైన గ్రౌండ్,సరైన మూత్రశాలు, మరుగుదొడ్లు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బుక్ స్టాల్ షాప్ ల తోటి కుమ్మక్కై పర్సంటేజ్ లతో పుస్తకాలు అమ్ముతున్నారన్నారు. అక్రమ పుస్తకాల అమ్మకాలలో నిలిపివేయాలని,  లేనియెడల స్కూల్స్,బుక్ స్టాల్స్ ల ముందు ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు బానోతు రాజు నాయక్, జి రవీందర్, చరణ్, అనిల్ కుమార్, రాజ్ కుమార్, సంతోష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -