పీడీఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి సురేష్
నవతెలంగాణ – కామారెడ్డి : ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని పీడీఎస్ యు రాష్ట్ర కార్యదర్శి జి సురేష్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ పరీక్షలు జరగాల్సిన సమయంలో పరీక్షలను వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ప్రయివేట్ కళాశాలల ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో యజమాన్యాలు తమ సొంత ఆస్తులను తనాఖా పెట్టి కళాశాలలను నడిపించామని, 5 సంవత్సరాల నుండి ఇబ్బందులలో ఉన్న మాకు ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపారు. కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన కళాశాల యజమాన్యాలు తెలంగాణ యూనివర్సిటీ విసీకి ఈ నెల 14న జరగాల్సినటువంటి డిగ్రీ అన్ని రకాల సెమిస్టర్ వాయిదా వేస్తున్నట్లు వైస్ ఛాన్స్లర్ కు నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇలా చేయడం ద్వారా విద్యార్థులందరూ నష్టపోయే అవకాశం ఉందనీ, ముఖ్యంగా తృతీయ విద్యా సంవత్సరం చదివి, పై చదువులకు వెళ్లాల్సిన విద్యార్థులకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇటు విద్యార్థులకు అటు కళాశాల యజమానులకు ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఉందనీ, వీలైనంతవరకి స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES