Thursday, May 22, 2025
Homeసినిమాఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌

ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

నూతన నాయకానాయికలు బాలు, షిన్నోవా నటించిన చిత్రం ‘ఒక బృందావనం’. బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్‌ తాటికొండ, వెంకట్‌ రేగట్టే, ప్రహ్లాద్‌ బొమ్మినేని, మనోజ్‌ ఇందుపూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రీ మూవీస్‌ ద్వారా ఈ నెల 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీరీలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నారా రోహిత్‌ ముఖ్య అతిథిగా విచ్చేయగా, నిర్మాత సాహు గారపాటి, దర్శకుడు వీఎన్‌ ఆదిత్యలు విశిష్ట అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌ మాట్లాడుతూ ‘ఇదొక ఇంట్రెస్టింగ్‌ అండ్‌ ఫీల్‌గుడ్‌ ఫిల్మ్‌. ఇదొక ఓ అబ్బాయి లైఫ్‌ జర్నీ. అందరికి ఓ మంచి బ్యూటీఫుల్‌ సినిమాను చూశామన్న అనుభూతి కలుగుతుంది’ అని అన్నారు. ‘ఈ మూవీ మ్యూజికల్‌ జర్నీ. బ్యూటీఫుల్‌ విజువల్స్‌ ఉంటాయి. ఎలాంటి హింసకి తావు లేకుండా రూపొందిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది’ అని నిర్మాత కిషోర్‌ తాటికొండ చెప్పారు. హీరో బాలు మాట్లాడుతూ ‘దర్శకుడు సినిమాను ఎంతో బాగా తెరకెక్కించాడు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది’ అని అన్నారు. మరో నిర్మాత మనోజ్‌ మాట్లాడుతూ, ‘ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నం దుకు చాలా ఆనందంగా ఉంది. అందర్నీ అలరించే ఫీల్‌గుడ్‌ సినిమా ఇది’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -