అదోనై పిక్చర్స్ క్రియేషన్స్ సమర్పణలో కొరియో గ్రాఫర్ సత్య మాస్టర్ దర్శకత్వంలో అంకిత జాదవ్, రోహిత్ భోగ హీరో, హీరోయిన్స్‌గా నటించిన ‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే’ పేరుతో రెండు పాటల రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పాటలను కెకె రెడ్డి నిర్మించారు. జయంత్ ఆర్యన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటలకు రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించారు. లిప్సిక, అదితి భావరాజు పాడారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు సాయి రాజేశ్, శైలేష్ కొలను, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఆషురెడ్డి అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్, డైరెక్టర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ, ‘అతి తక్కువ మంది క్రూతో రెండు సాంగ్స్‌ను తక్కువ టైమ్‌లో కంప్లీట్ చేశాం. ప్రొడ్యూసర్ కేకే రెడ్డి ఎంతో ప్యాషనేట్‌గా ఈ పాటలను ప్రొడ్యూస్ చేశారు. జయంత్ మ్యూజిక్, లిప్సిక, అదితి పాడిన తీరు, రాంబాబు సాహిత్యం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి’ అని అన్నారు.
‘మంచి లవ్ ఫీల్‌తో ఈ పాటలను బ్యూటీఫుల్‌గా పిక్చరైజ్ చేశారు మా డైరెక్టర్ సత్య. ఆయన కొరియోగ్రఫీ కూడా హైలైట్ అవుతుంది. లిప్సిక, అదితి ఈ పాటలను పాడిన విధానం చూస్తే వారికి గానకోకిల అని పిలవాలని అనిపిస్తోంది. జయంత్ మంచి ట్యూన్‌తో కంపోజ్ చేశారు. ఈ పాటలు మళ్లీ మళ్లీ వినేలా ఉంటాయి. మంచి పాటలుగా మీ ఆదరణ పొందుతాయి’ అని నిర్మాత కేకే రెడ్డి చెప్పారు. హీరోయిన్ అంకిత జాదవ్ మాట్లాడుతూ, ‘నేను చేసిన ఐదో మ్యూజిక్ ఆల్బమ్ ఇది. ఈ పాటలను న్యూయార్క్, షికాగోలో షూట్ చేశాం.
ఫీల్ గుడ్ లవ్ సాంగ్స్
- Advertisement -
- Advertisement -



