మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా ‘స్కై’. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘పోయేకాలం నీకు..’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు పృథ్వీ పెరిచెర్ల లిరిక్స్ రాయగా, యదు కృష్ణన్, వల్లవన్ పాడారు. శివప్రసాద్ క్యాచీ ట్యూన్‌తో కంపోజ్ చేశారు.
‘పోయేకాలం నీకు ముందుందని చెబుతుంటే, సచ్చిపోతున్నారు విననే వినను అంటుంటే, రాంగే రైటై పోదని చెబుతూ నేను ఉంటున్నా..’ అంటూ సాగుతుందీ పాట. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘తపనే తెలుపగ..’ సాంగ్ ప్రేక్షకాదరణ పొంది మిలియన్ వ్యూస్ రీచ్ అయింది. ఇప్పుడు ఈ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ – రసూల్ ఎల్లోర్, ఎడిటర్ – సురేష్ ఆర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – స్వాతి పెన్మెత్స, లిఖిత గుంటక.
ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -



