- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
బాన్సువాడ – దెగ్లూర్ బస్ కండక్టర్ ప్రయాణికులపై అనుచితంగా ప్రవర్తించారని ప్రయాణికులు మండిపడ్డారు. బస్ నెం ఏపి 29 జెడ్ 2267 సమయం 5 గంటల శనివారం బిచ్కుంద నుండి బయలుదేరుతున్న దెగ్లూర్ బస్సులో మహిళలు భారీగా బస్సు ఎక్కారు. దీంతో కండక్టర్ ఒక్కసారిగా కోపోద్రిక్తురాలై ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించిందని ప్రయాణికులు వాపోయారు. ప్రయాణికులతో మాట్లాడే తీరు ఇదేనా అని ఒక జర్నలిస్టు ప్రశ్నిస్తే.. “మీరు వచ్చి పని చేయండి, మాకేమైనా జీతాలు ఇస్తున్నారా “? అంటూ కండర్టర్ ఎదురు ప్రశ్నించింది.
- Advertisement -



