Tuesday, November 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా రైతు మృతి

మహిళా రైతు మృతి

- Advertisement -

నవతెలంగాణ-కాసిపేట
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొత్తవరిపేటకు చెందిన ఓ మహిళా రైతు అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసుకోగా .. సోమవారం మృతిచెందింది. కాసిపేట ఏఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవరిపేటకు చెందిన గుండా శ్రీదేవి(38) వ్యవసాయం చేస్తుండగా.. భర్త సుధాకర్‌ మంచిర్యాల ప్రయివేటు ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ యేడాది వారి 2.5 ఎకరాల పొలంతోపాటు మరికొంత పొలం కౌలుకు తీసుకొని సాగు చేశారు. మొత్తం మూడెకరాలలో వరి, మరో మూడు ఎకరాలలో పత్తి పంటలు వేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంటలు దెబ్బతిన్నాయి. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా చెల్లించాలన్న బెంగతో శ్రీదేవి ఈ నెల 5న ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు 108 అంబులెన్స్‌ లో బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వరంగల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. వారికి కుమార్తె, కుమారుడున్నారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు రూ.4లక్షల వరకు అప్పు ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -