Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeమానవిమెంతి ఆకుతో...

మెంతి ఆకుతో…

- Advertisement -

సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఒక్కో ఆకు కూరతో శరీరానికి అనేక లాభాలున్నాయి. ఇందులో ముఖ్యంగా మెంతికూర. ఇది కూర రుచిని పెంచడమే కాకుండా అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెంతి గింజలు అనేక ప్రయోజనాలు అందిస్తాయని అందరికి తెలిసిన విషయమే. వీటితోపాటు.. మెంతి ఆకులు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఐరన్‌, సెలీనియం, కాల్షియం, మాంగనీస్‌, మినరల్స్‌, జింక్‌ వంటి పోషకాలున్నాయి. ఇవి అనారోగ్య సమస్యలను తగ్గించడంలోఎక్కువగా సహాయపడతాయి.
పచ్చి మెంతి ఆకులు డయాబెటిస్‌ రోగుల్లో చక్కర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా.. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. మెంతి ఆకులలో పీచు జీర్ణక్రియ ప్రక్రియను సరిగ్గా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
అధిక రక్తపోటులో మెంతి ఆకులు కూడా మేలు చేస్తాయి. గెలాక్టోమన్నన్‌, పొటాషియం ఉండడం వలన రక్త ప్రసరణను నియంత్రిస్తాయి. మెంతి ఆకులు బరువు తగ్గిస్తాయి. అలాగే అజీర్ణం, మలబద్దకం, కడుపులో అల్సర్‌, పేగు మంట సమస్యను తగ్గిస్తాయి.
దగ్గు, బ్రోన్కైటిస్‌ ఎగ్జిమా వంటి వ్యాధులతో పోరాడడంలో ఇది సహాయపడుతుంది. మెంతి ఆకులను తినడం వలన తల్లిపాలు ఉత్పత్తి అవుతాయి. రోజు ఒక స్పూన్‌ మెంతి ఆకుల రసాన్ని తీసుకుంటే కడుపులో నులిపురుగులు తగ్గుతాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad