- Advertisement -
నవతెలంగాణ -పెద్దవంగర
ఫర్టిలైజర్ అసోసియేషన్ మండల నూతన కమిటీని ఆదివారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా దేవసాని దామోదర్, ఉపాధ్యక్షుడిగా మంచిల్ల సురేష్, గౌరవ అధ్యక్షుడిగా వెంకన్న, సభ్యులుగా రమేష్, గోపాల్ నాయక్, బొల్లు బీరన్న, అనిల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు సంయుక్తంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే మండలంలో ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తామని తెలిపారు. ఫర్టిలైజర్ అసోసియేషన్ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. తమ ఎన్నికకు సహకరించిన సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -