Monday, July 7, 2025
E-PAPER
Homeఖమ్మంప్రమాదం అంచుల్లోకి వెళ్లిన ఎరువుల లారీ.. 

ప్రమాదం అంచుల్లోకి వెళ్లిన ఎరువుల లారీ.. 

- Advertisement -

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ఎదురుగా వచ్చే ట్రాక్టర్ ను తప్పించబోయి ఎరువుల లోడ్ లారీ ప్రమాదం అంచుల్లోకి వెళ్లిన ఘటన ఆళ్ళపల్లి మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం నుండి ఎరువుల లోడ్ లారీ మండల పరిధిలోని మర్కోడు గ్రామానికి వస్తున్న క్రమంలో కాచనపల్లి, అనంతోగు గ్రామాల మార్గమధ్యలో ఓ మూల మలుపు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న  ట్రాక్టర్ సైడ్ ఇవ్వకపోవడంతో.. సింగిల్ బీటీ రోడ్డుపై లోడ్ లారీ ట్రాక్టర్ ను తప్పించబోయి అదుపుతప్పి రోడ్డుకు ఓ పక్కకు ఒరిగిందని తెలిపారు.

సింగిల్ బీటీ రోడ్డు పక్కనే ఇరు పక్కలా పెద్ద కందకాలు తీసి ఉండటంతో రోడ్డు దిగిన లోడ్ లారీ గోతిలో పడకుండా ఓ పక్కకు ఒరగడంతో ఎరువుల లారీతో పాటు తాను పెను ప్రమాదం నుండి బయటపడ్డానని డ్రైవర్ ఊపిరిపీల్చుకున్నాడు. అనంతోగు, కాచనపల్లి గ్రామాల మధ్య సుమారు 6.5 కి.మీ సింగిల్ బీటీ రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పడి, ప్రమాదకరమైన మూల మలుపులు ఉండి అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి, అనేక మంది క్షతగాత్రులైన సంఘటనలు ఉన్నాయి.. అయినా స్థానిక సంబంధిత అధికారులు, పాలకులు రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదని మండల వాసులు, ఉద్యోగులు వాపోతున్నారు. ఇకనైనా డబుల్ రోడ్డు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -