Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫర్టిలైజర్స్ యజమానిపై దాడి..రెండు నెలల జైలుశిక్ష

ఫర్టిలైజర్స్ యజమానిపై దాడి..రెండు నెలల జైలుశిక్ష

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
ఫర్టిలైజర్స్ షాపుకు సంబంధించిన బకాయి అడిగినందుకు గాను దుకాణం యజమానిపై దాడి చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులకు ఒకరికి రూ.5000 మరొకరికి రూ.2000 జరిమానా.. లేదా రెండు నెలల జైలుశిక్ష విధించినట్టు మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం 2017 వ సంవత్సరంలో మండలంలోని తాటిపల్లి గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ యజమాని అజ్జపల్లి నరసింహారెడ్డికి గ్రామానికి చెందిన మ్యాతరి అంబయ్య ,మ్యాతరి కిషోర్ లు రూ.850 బకాయిగా ఉన్నారు. కాగా యజమాని అయిన అజ్జపల్లి నరసింహారెడ్డి బకాయి విషయమై ఇద్దరినీ అడగగా నానా బూతులు తిడుతూ కట్టెతో అతడిని గాయపరిచారు. అప్పట్లో ఎస్సై కోటేశ్వరరావు కేసు నమోదు చేసి , ఛార్జి షీట్ దాఖలు చేయగా పబ్లిక్ ప్రాసికూటర్ లతీఫ్ ఉర్రహ్మాన్ వాదనలు వినిపించగా స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి దుర్గారాణి కేసులో ఏ 1 అయినా మేతరి అంబయ్యకు రూ.5000, ఎ2 అయినా మేతరి కిషోర్ లకు రూ.2000 జరిమానా లేదా రెండు నెలల జైలు శిక్ష విధించినట్టు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -