Saturday, February 21, 2026
E-PAPER
Homeజిల్లాలుఎరువుల కొరతను నివారించాలి: సీపీఐ(ఎం)

ఎరువుల కొరతను నివారించాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

అడిగిన ప్రతి ఒక్కరికి ఎరువులను అందించాలి: సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

ఎరువుల కోతను నివారించాలని అడిగిన ప్రతి ఒక్కరికి ఎరువులను అందించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. శనివారం నగరంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యూరియా కొరత పెరుగుతుందని ప్రధానంగా వరి నాట్ల కొరకు సిద్ధమవుతున్న రైతులకు యూరియా కొరత ఉండటంతో పాటు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిబంధన పెట్టడం మూలంగా రైతులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అర్థం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రోజుల తరబడి ఎరువుల దుకాణాలకు తిరుగుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ రద్దుచేసి రైతులకు అందుబాటులో ఎరువులను ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

వరి నారు ముదిరిపోయి సకాలంలో నాట్లు వేయని ఎడల రైతుల పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టుతూ రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదని అన్నారు. అంతేకాదు ప్రజా సమస్యలు పరిష్కారం కావని, నాయకులు ప్రజల్లో విద్వేశాలను పెంచటానికి దించే బదులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆయన హితువు పలికారు.

ప్రజలు దీని అర్థం చేసుకొని శాంతియుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా ప్రజా సమస్యలపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, పల్లపు వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు నన్నే సాబ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -