Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు అందుబాటులో ఎరువులు.. 

రైతులకు అందుబాటులో ఎరువులు.. 

- Advertisement -

పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్ 
కాటాపూర్ లో ఎరువుల విక్రయ దుకాణం ప్రారంభం 
నవతెలంగాణ – తాడ్వాయి 

మండలంలో రైతులకు అవసరమైన మేర వరకు ఎరువులను అందుబాటులో ఉంచామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని కాటాపూర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) ఆధ్వర్యంలో ఎరువుల విక్రయ దుకాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుత అవసరాలకు మేర రైతులు యూరియా కొనుగోలు చేయాలని అన్నారు. యూరియా దొరకదు అనే ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం వల్ల చాలా మంది రైతులు ముందస్తుగానే రెండవ దఫా, మూడో దఫా ఎరువులు కొని దాచుకుంటున్నారని అన్నారు. అలా కాకుండా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొనుగోలు చేయాలని సూచించారు. యూరియా సరఫరా లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య, సింగిల్ విండో  డైరెక్టర్ లు కాయితి లింగ చారి, యానాల సిద్ది రెడ్డి,  మాజీ సర్పంచ్ లు పోలెబోయిన కృష్ణ, బడే రాంబాబు, నాయకులు గౌరబోయిన బిక్షపతి, కోడి సతీష్, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -