నవతెలంగాణ – అశ్వారావుపేట: భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా రసాయన ఎరువులను సమతుల్యంగా వాడాలని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత కుమార్ సూచించారు. ప్రోఫెసైస్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో స్థానిక వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు సహాకారంతో నిర్వహించే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని అచ్యుతాపురంలో సాగులో మెలుకువలు – ఎరువులు వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హేమంత్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో పాటించవలసిన శాస్త్రీయ మెలకువలు గురించి వివరించారు. అనంతరం వ్యవసాయ సహాయ సంచాలకులు పి. రవికుమార్ మాట్లాడుతూ.. విత్తనాలు మరియు రసాయనాలు కొనుగోలు చేసినప్పుడు రైతులు తప్పనిసరిగా రసీదులు భద్రపరిచి, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలిపారు. అదేవిధంగా సాగునీరు వినియోగంలో పాటించాల్సినటువంటి శాస్త్రీయ మెలకువలను రైతులకు వివరించారు. వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎస్. మధుసూదన్ రెడ్డి భూసార పరీక్షలకు మట్టి నమూనాను ఏ విధంగా సేకరించాలి, ఏ పోషకాలను పంటలకు ఏ మోతాదులో ఏ విధంగా వాడాలో వివరంగా తెలిపారు. అదే విధంగా పర్యావరణ పరిరక్షణకు చెట్ల పెంపకం యొక్క ఆవశ్యకతను రైతు లకు వివరించారు. అశ్వారావుపేట మండల వ్యవసాయ అధికారి శివరామ ప్రసాద్ మాట్లాడుతూ.. పంట మార్పిడి వలన కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించారు. అశ్వారావుపేట ఉద్యాన అధికారి వేణుమాధవ్ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగులో పాటించాల్సినటువంటి మెలకువలు, పంట అవశేషాలను భూమిలో కలియ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు సతీష్ , సూరిబాబు,వ్యవసాయ కళాశాల విద్యార్థులతో పాటు అచ్యుతాపురం రైతు సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భూసారానికి తగ్గట్లుగా ఎరువులు వాడాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES