– కమ్మర్ పల్లి గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో కొలహలం
– నేడు సెమి ఫైనల్, ఫైనల్ మ్యాచులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేజియంలో రాష్ట్ర స్థాయి అండర్-16 బాలుర బాలికల వాలీబాల్ ఛాంపియన్ షిప్ 2026 పోటీలు గత మూడు రోజులుగా పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ లో ఉమ్మడి పది జిల్లాల నుండి బాలుర బాలికల విభాగంలో 10 జట్ల చొప్పున పాల్గొంటున్నారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ 2026 లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో శనివారం నాటికి లీగ్ దశ పోటీలు ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సెమి ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు ఉంటాయని వివరించారు. క్రీడాకారులు, యువకులు పెద్ద ఎత్తున హాజరై రాష్ట్రస్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ 2026 పోటీలను తిలకిస్తుండడంతో గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియంలో కోలాహలం నెలకొంది. సుమారు వెయ్యి మందికి పైగా
ఉమ్మడి పది జిల్లాల నుండి పోటీలో పాల్గొన్నందుకు వచ్చిన క్రీడాకారులతో పాటు కోచ్ లు, పిఈటిలకు స్టేడియం వద్దనే భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు.రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ పాల్గొంటున్న క్రీడాకారుల ప్రతిభను తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల రమేష్ బాబు, నిజామాబాద్ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్.వి హనుమంత్ రెడ్డి, నిజామాబాద్ వాలీబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటర్ మల్లేష్ గౌడ్, నిజామాబాద్ వాలీబాల్ అసోసియేషన్ ట్రెజరర్ ఏనుగు గంగారెడ్డి, తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ట్రెజరర్, ఫార్మార్ ఇండియన్ వాలీబాల్ ప్లేయర్ కే.క్రిష్ణ ప్రసాద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు అజారుద్దీన్, సభ్యులు విక్రమ్ చైతన్య తదితరులు ఉన్నారు.



